బాత్​రూంకు వెళ్లి సెప్టిక్​ ట్యాంక్​లో పడ్డ వృద్ధురాలు.. 25 అడుగుల లోతులో!

By

Published : Jul 1, 2022, 6:16 PM IST

thumbnail
Woman Fallen Septic Tank: 70 ఏళ్ల ఓ వృద్ధురాలు.. సెప్టిక్​ ట్యాంక్​లో పడిపోయిన ఘటన గుజరాత్​ సూరత్​లోని అంబోలి ప్రాంతంలో జరిగింది. రోజూలానే శుక్రవారం ఉదయం బాత్​రూంకు వెళ్లింది 70 ఏళ్ల కపిలాబెన్​ రామనంది. అప్పుడు వర్షం కురుస్తుండగా మరుగుదొడ్డి ముందు ఉన్న సెప్టిక్​ ట్యాంక్​ పైభాగం కుంగిపోయింది. ఇది గమనించని వృద్ధురాలు.. 25 అడుగుల మరుగుదొడ్డి గుంతలోకి పడిపోయింది. కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. తీవ్రంగా శ్రమించి ఆమెను కాపాడారు. సేఫ్టీ బెల్ట్​ సాయంతో పైకి తీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.