పునీత్ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: ఆర్జీవీ - పునీత్ ఘాట్‌ను సందర్శించిన ఆర్జీవీ
🎬 Watch Now: Feature Video
RGV Puneeth Rajkumar: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బెంగళూరులో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించారు. బెంగళూరులోని ఆయన సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. తన తాజా చిత్రం 'ఖత్రా' ప్రచారంలో భాగంగా బెంగళూరు వెళ్లిన వర్మ.. చిత్ర బృందంతో కలిసి పునీత్ రాజ్‌కుమార్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో పునీత్ సేవలను గుర్తుచేసుకున్న ఆయన... పునీత్ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST