LIVE VIDEO: కార్యకర్తల భుజాల పైనుంచి బారికేడ్లు దూకేసిన రేవంత్‌రెడ్డి - telangana congress news
🎬 Watch Now: Feature Video
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్‌భవన్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్తల నినాదాలు, అరుపులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజ్‌భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్దకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను.. బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలతో నిలువరించేందుకు పోలీసులు యత్నించారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకొంది. పెద్దఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ సమయంలో కార్యకర్తల భుజాలపైకి ఎక్కిన రేవంత్‌రెడ్డి.. 'మోదీ సర్కార్ జూటా సర్కార్' అని రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శించారు. అనంతరం కార్యకర్తల భుజాల నుంచి బారికేడ్లను దూకేశారు.