ప్రతిధ్వని: యువత నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో కీలకం - prathidwani latest news
🎬 Watch Now: Feature Video
కరోనా సంక్షోభ సమయంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో కీలకమని దేశ యువతకు ప్రధాని మోదీ సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో పనివిధానంతో పాటు ఉద్యోగ స్వభావాలు మారిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత నూతన నైపుణ్యాలను సంతరించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. యువతలోని శక్తి సామర్థ్యాలను వెలికితీసేందుకు కేంద్రం ఐదేళ్ల క్రితం స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022 నాటికి 40 కోట్ల మందిని నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా నేపథ్యంలో స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ఇంకెంత వేగవంతం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి ? లాంటి అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.