ప్రతిధ్వని: రెండో డోస్ వేసుకునే వరకు మధ్యలో వస్తోన్న అపోహలేంటి? - భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ న్యూస్
🎬 Watch Now: Feature Video
కరోనా కాటు నుంచి తప్పించే ప్రాణరక్షక కవచం.. వ్యాక్సిన్. రెండు డోసుల వ్యాక్సిన్ పంపిణీలో నాలుగు నుంచి పన్నెండు వారాల విరామం ఉంటోంది. ఈ సమయంలోనే మొదటి డోసుకూ, రెండో డోసుకూ మధ్యలో అనేక వ్యాధి లక్షణాలు పొడసూపుతున్నాయి. కొందరు వ్యాక్సిన్ వేసుకున్నాకా పాజిటివ్‌గా తేలుతున్నారు. కొరత కారణంగా వ్యాక్సిన్ రెండో డోస్ లభిస్తుందో లేదో తెలియని గందరగోళం ఒకవైపు. సెకండ్ డోస్ సకాలంలో వేసుకోకపోతే ఏమవుతుందోనన్న ఆందోళన మరొకవైపు. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నది మొదలు రెండోడోస్ అందుకునేదాకా.. చుట్టుముడుతున్న అవాంతరాలు, అపోహలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది..