prathidhwani: రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి తెరుచుకునేదెప్పుడు? - prathidhwani debate
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకునేదెప్పుడు? మళ్లీ బడిగంట చప్పుడు వినేది ఎప్పుడు? కొద్ది రోజులుగా అందరిలో ఇదే చర్చ. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్నాయి. కొన్ని ఇప్పటికే మొదలు పెట్టగా.. మరికొన్ని ఎప్పటి నుంచి తెరవాలో అని తర్జన భర్జనలు సాగిస్తున్నాయి. ఇదే అంశంపై పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృత సమాలోచనలు చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం ఎప్పుడు? బడి గంటలు మోగేనా..? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.