గోదావరిలో ఒయ్యారాలు ఒలకబోస్తున్న నురుగ - గోదావరిలో తెల్లని నురగ
🎬 Watch Now: Feature Video
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని వద్ద గోదావరి నదిలో తెల్లని నురుగ దర్శనమిచ్చింది. ఒంపులు తిరిగిన నురగ ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. సాధారణ నీరు కంటే భిన్నంగా ఉండి.. నది మధ్యలో ప్రవహిస్తున్న దీనిని చూసి ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏదైనా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యమా? లేక వేరే ప్రాంతం నుంచి ఈ నీరు వస్తుందా? అని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.