FIRE ACCIDENT: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు - fire accident at vithalwadi
🎬 Watch Now: Feature Video

ఓ వైపు వర్షం కురుస్తుండగా.. మరోవైపు హైదరాబాద్ నారాయణగూడ హరివిహార్ కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని 3-5-199/బి/9 మూడంతస్తుల భవనంలో గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
Last Updated : Jul 23, 2021, 4:25 AM IST