ప్రతిధ్వని: రహదారుల నాణ్యత విషయంలో తప్పు ఎక్కడ జరుగుతోంది? - bharat debate
🎬 Watch Now: Feature Video
ప్రపంచంలోని రహదారుల నిర్మాణంలో.. భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో 90 శాతం ప్రజలు రోడ్డు రవాణాపైనే ఆధారపడి ఉన్నారు. 60 శాతం సరుకు రవాణా.. ఈ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. దేశంలో ప్రధానంగా జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవేలు, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల నిర్మాణం జరుగుతోంది. రోడ్డు ఏదైనా.. నాణ్యతా ప్రమాణాలు తీసికట్టుగా ఉంటున్నాయి. ఇంత ప్రాధాన్యత గల రహదారుల నిర్మాణంలో.. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం.. డిజైనింగ్‌లో లోపాలు, ఆక్రమణలు, రోడ్ల నిర్వహణలో లొసుగుల వంటి అంశాలెన్నో రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. రహదారుల నాణ్యత విషయంలో తప్పు ఎక్కడ జరుగుతోంది? కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల బాధ్యత ఎంత? ప్రజాధనం ఎంత దుర్వినియోగమవుతోంది? లోపాలను ఎలా సరి చేసుకోవాలన్న అంశాలపై.. ప్రతిధ్వని చర్చను చేపట్టింది.