ప్రతిధ్వని: జనారణ్యంలో క్రూరమృగాలు - విశాఖపట్నంలో ఆరుగురు దారుణ హత్య
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11416811-1034-11416811-1618496150184.jpg)
అదుపు లేని క్రూరత్వం.. అంతులేని విషాదం. వరస ఉన్మాద ఘటనలు చెబుతున్న చేదు నిజం ఇది. కారణాలు ఏవైనా కావొచ్చు. రోజురోజుకీ పాశవిక హత్యల రక్తపు తడి ఆరటం లేదు. వయో వృద్ధుల నుంచి నెలల పసికందుల వరకు అన్యాయంగా బలైపోతున్నారు. మనిషి అన్నవాడు.. మాయమైపోతున్నాడు. మానవత్వం అనేది.. మచ్చుకైనా కనబడట్లేదు. వావివరుసలు చెరిగిపోతున్నాయి. మదనపల్లి మూఢ హత్యల నుంచి విశాఖ నగరంలో సాగిన నరమేధం వరకు. ఒకటి కాదు.. రెండు కాదు. అన్నింట్లోనూ గోచరించేది ఘోరత్వం, మృగత్వం. జనారణ్యంలో క్రూరమృగాలు స్వైర విహారం చేస్తున్నాయి. అసలు ఎందుకీ పరిస్థితి? ఏమిటీ పరిష్కారం?.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.