ప్రతిధ్వని: మిషన్ కర్మయోగి ఉద్దేశం, లక్ష్యాలు
🎬 Watch Now: Feature Video
దేశ భవిష్యత్ అవసరాలకు తగట్టుగా ఉద్యోగుల సామర్థ్యాన్ని నిరంతరం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మయోగికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల ఉద్యోగుల సామర్థ్యాన్ని.. పారదర్శకత, సాంకేతికతల మేళవింపుతో నిర్మాణాత్మకంగా, నవ్యావిష్కరణల దిశగా సాన పట్టడమే మిషన్ కర్మయోగి ఉద్దేశం. ఉద్యోగులంతా దేశాభివృద్ధి కోసం ఒకే దృక్పథంతో ఆలోచించేలా దీనిలో శిక్షణ ఇస్తారు. శిక్షణా కార్యక్రమ పర్యవేక్షణకు ప్రధానమంత్రి మానవవనరుల మండలి పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ మండలిలో కేంద్ర కేబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. విభిన్న రంగాల దేశవిదేశీ నిపుణులు, సివిల్ సర్వీసుల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో మిషన్ కర్మయోగి లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Sep 3, 2020, 9:49 PM IST