Bhadradri Temple Fog visuals : మంచు కురిసే వేళలో... భద్రాద్రి రమణీయ దృశ్యాలు - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
Bhadradri Temple Fog visuals : మంచు కురిసే వేళలో... ఆ రామయ్య సన్నిధి దృశ్యాలు మదిని దోచేస్తున్నాయి. భద్రాద్రి రామయ్య ఆలయాన్ని పొగమంచు కమ్మేసింది. ఉదయాన్నే మంచు... వర్షంలా కురిసింది. పచ్చటి ఆకులపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఇక రోడ్లన్నీ పొగతో దట్టంగా అలుముకున్నాయి. ఆలయ పరిసరాలు, గోదావరి పరీవాహక ప్రాంతాలు చీకటిని తలపిస్తున్నాయి. మంచు దుప్పట్లోని భద్రాద్రి... కనువిందు చేసే ఈ దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు తమ ఫోన్లలో బంధిస్తున్నారు.