'స్వర్ణం తీసుకుంటున్నప్పుడు గర్వంగా ఫీలయ్యా' - sindhu expression after reached to hometown

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 27, 2019, 10:16 PM IST

Updated : Sep 28, 2019, 12:50 PM IST

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు హైదరాబాద్​లో​ అడుగుపెట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె... గొప్ప విజయంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. " 2 రజతాలు, 2 కాంస్యాల తర్వాత స్వర్ణం కల సాకారమైంది. ఎంతో నిరీక్షణ అనంతరం బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉంది. గతంలో సెమీస్​లో ఓడిపోయినప్పుడు బాధ పడ్డాను. ప్రతిసారి ఒకే రకమైన గేమ్​ ప్లాన్​ పనిచేయదు. ఓడిపోయిన ప్రతిసారి సమీక్ష చేసుకుని కష్టపడాలి. క్వార్టర్స్​, సెమీస్​ మ్యాచ్​ల్లాగానే ఫైనల్​ ఆడా. ఆ సమయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఫైనల్​లో లాంగ్​ ర్యాలీలకు సిద్ధమయ్యా. స్వర్ణ పతకం తీసుకుంటున్నప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యా. నేను స్వర్ణం సాధించాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అందరికీ ధన్యవాదాలు" -- పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి
Last Updated : Sep 28, 2019, 12:50 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.