చంకలో పాప.. అద్భుత క్యాచ్‌తో ఆహా! - Mom catches ball in tournament
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12083612-1030-12083612-1623319550920.jpg)
అమెరికా.. కాలిఫోర్నియా సాన్డిగో నగరంలో పెట్కోపార్క్లో జరిగిన ఓ బేస్‌బాల్ టోర్నీలో ఆశ్చర్యమైన సంఘటన జరిగింది. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ వీక్షకురాలు(తల్లి) చంకలో బిడ్డ ఉండగానే ఒంటిచేత్తో బంతిని క్యాచ్ పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆటలో భాగంగా ఓ ప్లేయర్ బంతిని బాదగా.. అది కాస్త స్టాండ్స్‌లోకి వెళ్లింది. అక్కడే కుర్చిలో బిడ్డను చేతిలో పట్టుకుని కూర్చున్న ఆ తల్లి అమాంతం నిలబడి ఒంటిచేత్తో ఆ బాల్‌ను అద్భుతంగా పట్టుకుంది. ఇది చూసిన అక్కడి వారు కేరింతలతో ఆమెను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విపరీతంగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.