శబరిమలకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్- ఇరుముడి సమర్పణ - Ajay Devgan sabarimala visit
🎬 Watch Now: Feature Video

Ajay Devgan Sabarimala Visit: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో బుధవారం ఉదయం బయలుదేరిన అజయ్.. నిలక్కల్ నుంచి పంబా వరకు రోడ్డు మార్గంలో వెళ్లారు. బుధవారం ఉదయం 11 గంటలకు దేవాలయానికి చేరుకున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి కృష్ణకుమార వారియర్.. అజయ్‌కు స్వాగతం పలికారు. అనంతరం దేవగణ్ ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప దీక్ష విరమించి.. స్వామివారికి ఇరుముడి సమర్పించారు.