'ఇలాంటి సినిమా టాలీవుడ్లో ఇప్పటివరకు రాలేదు' - అశ్వథ్థామ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
🎬 Watch Now: Feature Video

సమాజంలో అమ్మాయిల భద్రత నేపథ్యంగా యువ కథానాయకుడు నాగశౌర్య కథనందించి నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణతేజ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన ఈ చిత్రం.. నాగశౌర్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తమ కార్యాలయం వద్ద చిత్రబృందం బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేసింది చిత్రబృందం. అశ్వథ్థామను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు హీరో నాగశౌర్య.
Last Updated : Feb 28, 2020, 5:04 PM IST