20 గొర్రెల గొంతు కొరికి రక్తం తాగిన పూజారి.. ఎక్కడంటే? - Priest drank sheep's blood in karnataka
🎬 Watch Now: Feature Video
Priest Drank Sheep Blood: కర్ణాటక, చామరాజనగర జిల్లాలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. అన్నూరుకెరె గ్రామంలోని గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఓ పూజారి ఏకంగా 20కుపైగా గొర్రెల గొంతు కొరికి రక్తం తాగాడు. భక్తులు అమ్మవారికి సమర్పించేదుకు తీసుకొచ్చిన గొర్రెలను పూజారి అలా కొరికి రక్తం తాగితే.. దేవుడికి తమ నైవేద్యం అందినట్లు భావిస్తారు అక్కడి ప్రజలు. గ్రామ దేవత దొడ్డమాతాయి ఉత్సవాల్లో ఇలా చేయడం దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారమని స్థానికులు తెలిపారు. ఏటా ఫాల్గుణ మాసంలో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST