సీఎం జగన్ నివాసానికి షర్మిల - కుమారుడి వివాహానికి ఆహ్వానం - ముఖ్యమంత్రి జగన్ షర్మిల
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 8:04 PM IST
|Updated : Jan 3, 2024, 10:44 PM IST
YS Sharmila Reached to CM Jagan House: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బుధవారం సాయంత్రం కుటుంబసమేతంగా కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి, విజయమ్మలు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే.
కడప నుంచి బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చారు. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ను కలుసుకున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సోదరుడు జగన్ను షర్మిల ఆహ్వానించారు. సీఎం జగన్ నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న షర్మిల, జగన్ కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. జగన్తో సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం షర్మిల గన్నవరం చేరుకుని ప్రత్యేక విమానంలో దిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ఇప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. దిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే ముందు తన సోదరుడ్ని కలవడం రాజకీయవర్గాల్లో అసక్తిని రేకెత్తిస్తోంది. తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆమె ఇడుపులపాయ వేదికగానే మంగళవారం రోజున ప్రకటించగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లభించిన స్థానాల్లో తాము అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్లె 31 స్థానాలు అధికంగా విజయం సాధించిందని వ్యాఖ్యానించారు.