Video Viral : ప్రమాదకరమైనరీతిలో బైక్స్ స్టంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ - bike stunts video
🎬 Watch Now: Feature Video
Dangerous Bike Stunts In Hyderabad : ఈ మధ్య యువత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చెప్పి.. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రమాదకరమైన విన్యాసాలను చేస్తున్నారు. హైదరాబాద్లోని సైబరాబాద్లో పలు ప్రాంతాల్లో బైకులపై కొందరు ఆకతాయిలు విన్యాసాల పేరుతో హల్చల్ సృష్టించారు. అమ్మాయిలతో కలిసి ఆందోళనకరమైన రీతిలో యువకులు బైక్ స్టంట్స్ చేస్తున్నారు. వెనుక కూర్చున్న యువతి.. కనీసం భయం లేకుండా ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతూ కనిపిస్తోంది.
ఈ విధమైన విన్యాసాలు ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, తీగల వంతెనపై ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేస్తున్నారు. ఒక కార్యక్రమంలో విన్యాసాలను చేస్తున్నా... పోలీసులు కూడా ఏం చేయలేక ప్రేక్షక పాత్ర వహిస్తూ.. అలాగే చూస్తుండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన తరువాత కూడా ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అందరూ ప్రయాణించే రోడ్లపై ఇలాంటి సాహసాలు ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా విన్యాసాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. కోరుతున్నారు.