బైక్‌పైనే కుంపటి పెట్టి చలి కాచుకుంటున్న యువకులు - madhyapradesh latest news
🎬 Watch Now: Feature Video
శీతాకాలంలో చలి గురించి చెప్పనవసరం లేదు. బయటకి వెళ్తే గడ్డకట్టుకుపోతామేమో అనేంతగా ఉంటుంది. మరి బైక్‌పై వెళుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా. దీనికి పరిష్కారంగా ఇద్దరు యువకులు బైక్‌పై కుంపటి పెట్టి చలి కాచుకుంటున్నారు. ఇదేంటి వింతగా బైక్‌పై ఎలా చలికి మంట కాచుకోవడం అనుకుంటున్నారా మరి అదే కదా విశేషం
బైక్‌పై వెళుతున్నప్పుడు మంట కాచుకోవడం బహూశా ఎవరూ చూసి ఉండరు. మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత సంఘటన జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై సరదాగా బయటకు వెళ్లారు. తీవ్రంగా చలేయడం వల్ల వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ పైనే పొయ్యి పెట్టి నిప్పంటించాడు. అలా చలి కాచుకుంటూ బయట తిరిగారు. ఈ చలి కాచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణంలో చలి వేయకుండా ఇదో కొత్త మార్గం అంటున్నారు ప్రజలు.