భారీ వరదకు కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు, వంతెన దాటేందుకు యత్నించి - floods in ahmedabad
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సినా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల వంతెనలు నీట మునిగాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు.. వంతెనలపైకి వెళ్లకుండా పోలీసులు, అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ చాలా మంది వంతెన దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం.. బ్రిడ్జి దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు వరదనీటిలో కొట్టుకుపోయారు. వెంటనే గమనించిన స్థానికులు ఒకర్ని కాపాడగా.. మరొకరు గల్లంతయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST