రైలు ఇంజిన్‌కు వేలాడుతూ యువకుడి మృతదేహం- చాలా దూరం వెళ్లాక!! - ఫిరోజాబాద్‌లో రైలు ఇంజిన్‌కు మృతదేహాం
🎬 Watch Now: Feature Video
Published : Nov 14, 2023, 8:21 AM IST
|Updated : Nov 14, 2023, 8:58 PM IST
Young Man Body Hanging On Train Engine : రైలు ఇంజిన్‌కు యువకుడి మృతదేహం వేలాడుతున్న విషయాన్ని గమనించుకోకుండా ప్యాసింజర్ ట్రైన్‌ను చాలా దూరం తీసుకెళ్లాడు లోకోపైలట్. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు కేకలు వేయటం వల్ల లోకోపైలట్.. ట్రైన్‌ను ఆపాడు. అనంతరం రైల్వే సిబ్బంది.. మృతదేహాన్ని తొలగించారు.
ఫరూఖాబాద్ నుంచి శికోహాబాద్ వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్ ఇంజిన్‌కు మృతదేహం వేలాడుతూ ఉంది. మార్గమధ్యలో.. ట్రాక్ దగ్గర ఉన్న కొందరు.. ఇంజిన్‌కు డెడ్‌బాడీ ఉండటం చూసి పెద్దగా కేకలు వేశారు. ఆ అరుపులను విన్న లోకోపైలట్ రైలును ఆపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంజిన్ నుంచి తొలగించి.. శికోహాబాద్ స్టేషన్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. శవపరీక్షల నిమిత్తం జిల్లా ఆసుప్రతికి తరలించారు. మృతుడిని మైన్‌పురి జిల్లాలోని నాగ్లా మదారి ప్రాంతానికి చెందిన సౌరవ్ కుమార్(26) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతదేహం ఇంజిన్‌కు ఎలా వేలాడిందన్న విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు.