విద్యుత్ టవర్‌పైకి ఎక్కి యువతి హల్చల్.. బహిర్భూమికి వెళ్తానని చెప్పి.. - ఝార్ఖండ్ ధన్‌బాద్ ఎలక్ట్రికల్ టవర్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-17714961-thumbnail-4x3-towerii.jpg)
ఝార్ఖండ్.. ధన్‌బాద్ జిల్లాలోని పంచేట్‌లో హైటెన్షన్ పవర్ గ్రిడ్ టవర్‌పైకి ఎక్కి సునీత ముర్ము అనే యువతి హల్చల్ చేసింది. గమనించిన స్థానికులు టవర్ చుట్టూ గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సునీతను ఒప్పించి కిందికి దించారు. అనంతరం ఆమె బంధువులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. సెమీ న్యూరోటిక్ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు మంచి వైద్యం అందించమని సూచించి సునీతను అప్పగించారు. బహిర్భూమికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్లిన సునీత తిరిగి ఇంటికి రాలేదని ఆమె భర్త పోలీసులకు చెప్పాడు.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST