Yennam Srinivas Reddy Fires on BJP and BRS : 'త్వరలో బీజేపీ నుంచి పెద్ద వికెట్లు పడబోతున్నాయి' - తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 7:43 PM IST

Yennam Srinivas Reddy Fires on BJP and BRS : బీజేపీ నుంచి త్వరలో పెద్ద వికెట్లు పడబోతున్నాయని మహబూబ్​నగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు యెన్నం శ్రీనివాస్​రెడ్డి(Yennam Srinivas Reddy) అన్నారు. బీజేపీను వీడి కాంగ్రెస్​లో చేరిన తర్వాత ఆయన మొదటి సారిగా మహబూబ్​నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ అరాచకపాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని.. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి, అన్నివర్గాలు కాంగ్రెస్ జెండా కిందకు చేరుతున్నారని అన్నారు. 

Yennam Srinivas Reddy Comments on BRS : ఎందుకోసం సోనియా తెలంగాణ ఇచ్చిందో.. తొమ్మదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని యెన్నం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అమరుల ఆశయాలు నెరవేరాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్​ను(CM KCR) గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీలో పనిచేశానని.. బీజేపీ-బీఆర్ఎస్ మైత్రి తర్వాతే తాను కాంగ్రెస్ వైపు చూశానన్నారు. కాంగ్రెస్​లోనూ కేసీఆర్​ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తానని చెప్పారు. అమలుకు సాధ్యమైన హామీలే కాంగ్రెస్ ఇచ్చిందని.. సోనియా ఇచ్చిన 6 గ్యారంటీలు(Congress Six Guarantees in Telangana) అధికారంలోకి వచ్చాక తప్పక కార్యరూపం దాల్చుతాయన్నారు. మహబూబ్​నగర్ నియోజకవర్గంలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజలు స్వేచ్ఛ లేకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని విమర్శించారు. పాలమూరులో అరాచకం పోవాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా.. కార్యకర్తగా వారి గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.