Yadadri Temple : యాదాద్రీశుడికి కనులపండువగా లక్షపుష్పార్చన - yadadri special pooja
🎬 Watch Now: Feature Video
Laksha Pushparchana at Yadadri Temple : ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలో ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ.. సన్నాయి మేళాల మధ్య శాస్త్రోక్తంగా ఈ ఉత్సవం కనుల పండువగా జరిగింది.
లక్ష పుష్పార్చన పూజ అనంతరం దేవుడికి హారతులందించిన అర్చకులు.. పూజలో పాల్గొన్న భక్తులకు ఉత్సవాల విశిష్టతను తెలియజేశారు. ఆదివారం వారంతరం సెలవు కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఉచిత దర్శనానికి దాదాపు రెండు నుంచి మూడు గంటలు పట్టింది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు నుంచి నుంచి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. లడ్డు ప్రసాదం కౌంటర్ల దగ్గర, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.