ETV Bharat / state

తీవ్ర అల్పపీడనం బలహీనపడే అవకాశం - ఆ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు - RAINS IN ANDHRA PRADESH

తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అంచనా - ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన - మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

RAINS IN ANDHRA PRADESH
Heavy Rains in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2024, 7:59 AM IST

Updated : Dec 25, 2024, 10:18 AM IST

Heavy Rains in Andhra Pradesh : ఏపీలోని నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఉత్తర భారతదేశం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి ఈ అల్పపీడనంతో పాటు తేమను తనవైపు లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బుధవారం కల్లా క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరోక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

మూడు రోజులు వర్షాలు : వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఇండియన్​ మెట్రోలాజికల్​ డిపార్ట్​మెంట్​ పేర్కొంది. బుధవారం రోజున నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. బుధవారం(డిసెంబరు 25న) మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించింది.

అన్ని పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు : రాష్ట్రంలోని దాదాపు అన్ని పోర్టుల్లో మూడో నంబరుపై ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం (డిసెంబరు 28) తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గనున్నాయి. మంగళవారం నిన్న(డిసెంబరు 24) తూర్పుగోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు తదితర జిల్లాల్లో కాస్తా తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు కూడా వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలోనే ఉండడంతో సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘాలతో నల్లగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నందిగామ, గన్నవరం, ళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠం : దాదాపు 10 నుంచి 15 రోజులుగా అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేవు. ఈ అల్పపీడన ప్రభావంతో ఉదయం పూట ఆకాశం మేఘాలమయం కావడంతో సూర్యుడు కూడా కనిపించడం లేదు. వాతావరణ మారడంతో చాలా మంది ప్రజలు శ్వాస బాధలతో ఇబ్బందులు పడుతున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - 2 రోజుల పాటు భారీ వర్షాలు!

Last Updated : Dec 25, 2024, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.