ETV Bharat / health

బీపీతో బాధపడుతున్నారా? - ఇవి తింటే అదుపులో ఉంటుందట! - BEST FOODS TO LOWER HIGH BP

-వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న హైబీపీ కేసులు -డైట్​లో ఈ ఫుడ్స్​ చేర్చుకోవాలని సూచిస్తున్న నిపుణులు

Best Foods to Lower High BP
Best Foods to Lower High BP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 11 hours ago

Best Foods to Lower High BP: మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు.. ఇలా కారణాలు ఏమైతేనేమి వృద్ధాప్యంలో రావాల్సిన అనారోగ్య సమస్యలు 40 ఏళ్ల లోనే వచ్చేస్తున్నాయి. అందులో హైబీపీ కూడా ఒకటి. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బీపీ నార్మల్​కు వచ్చేందుకు మందులు వాడుతుంటారు. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తారు. అయినా.. రక్తపోటు అదుపులో ఉండట్లేదని వాపోతుంటారు. అయితే.. మెడిసిన్​ వాడడం, ఉప్పును తగ్గించిన మాత్రాన బీపీ కంట్రోల్​లోకి వచ్చేయదంటున్నారు నిపుణులు. రక్తపోటు కంట్రోల్​లో ఉండాలంటే.. కొన్ని ఫుడ్స్​ను ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

సిట్రస్​ పండ్లు: పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రోజుకు 400 గ్రాముల ఫ్రూట్స్​ను తినాలని సలహా ఇచ్చింది. బీపీ అదుపులో ఉండడానికి సిట్రస్ పండ్లు చాలా మేలు చేస్తాయట. వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం, శరీరంలోని అధిక సోడియంను బయటకు పంపి, రక్తనాళాలను సడలించడంలో సహాయపడతాయని.. తద్వారా రక్తపోటు తగ్గించడానికి దోహదపడతాయని అంటున్నారు. అందుకే.. ద్రాక్ష, నారింజ, నిమ్మ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​కు సంబంధించిన "నేషనల్​ లైబ్రరీ ఆఫ్​ మెడిసిన్​" వెబ్​సైట్​లో ప్రచురించింది.(రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి)

చేపలు: హైబీపీతో బాధపడే వారు చేపలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాలను సడలించి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు. అంతేకాకుండా, ఇవి రక్తం గడ్డకట్టకుండా చేసి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు.

ఆకుకూరలు: ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ముందుంటాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర వంటి వాటిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయని.. బీపీని అదుపులో ఉంచుతుందని అంటున్నారు. అలాగే వీటిల్లోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.

గింజలు: ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా, హైబీపీని నియంత్రించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి ఫైబర్, అర్జినైన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయని.. అర్జినైన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందంటున్నారు. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విశాలం చేయడానికి సహాయపడుతుందని.. దీంతో రక్త ప్రవాహం సులభంగా జరిగి, రక్తపోటు తగ్గుతుందని అంటున్నారు.

బెర్రీలు: బెర్రీలలో ఆంథోసైనిన్లు ఉన్నాయని.. ఇవి ఆంథోసైనిన్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయని, రక్త ప్రవాహాన్ని నిరోధించే అణువుల ఉత్పత్తిని తగ్గించి రక్తపోటు అదుపులో ఉంచేందుకు సహాయపడవచ్చని అంటున్నారు.

ఆలివ్​ ఆయిల్​: ఆలివ్ ఆయిల్‌లో ఒలేయిక్ యాసిడ్ అధికంగా ఉంటుందని.. ఇది రక్తనాళాలను సడలించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని.. తద్వారా బీపీ అదుపులో ఉంటుందని అంటున్నారు. అలాగే ఇది శరీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని అంటున్నారు. ఇవే కాకుండా.. తృణధాన్యాలు, క్యారెట్లు, గుడ్లు, టమాటా, బ్రోకలీ, పెరుగు, కివీ, లీన్​ మాంసాలు వంటివి కూడా హైపర్​టెన్షన్​ తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గుడ్​ కొలెస్ట్రాల్​తో ఎన్నో ప్రయోజనాలు! ఈ నూనెలు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు!!

మీకు హై బీపీ ఉందా? - ఈ ఆహారం అస్సలు తీసుకోకండి!

హైదరాబాద్​లో 40 శాతం యువతలో బీపీ, షుగర్! - వెల్లడించిన పరిశోధన - ఇలా జాగ్రత్తపడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.