Bumrah Border Gavaskar Trophy : 2024 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో 10.90 సగటుతో 21 వికెట్లు నేలకూల్చాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్లు కూడా ఈ స్థాయి ప్రదర్శన చేయకపోవడం గమనార్హం. ఈ సిరీస్‌లో బుమ్రానే నెం 1 బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌కు అతడే వెన్నుముకలా ఉన్నాడు.
అయితే టీమ్ఇండియా బౌలింగ్ దళంలో అతడికి సహకారం కరవైంది. జట్టులో మిగతా బౌలర్ల నుంచి బుమ్రాకు ఎలాంటి సహకారం అందడం లేదు. మరి సిరీస్ గమనాన్ని నిర్దేశించే నాలుగో టెస్టులో అయినా సహచర బౌలర్లు పేస్ దళపతికి అండగా నిలుస్తారా? అనేది అభిమానల్లో ఆందోళన కలిగిస్తోంది.
తేడా స్పష్టం
ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా 21 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా, మిగిలిన టీమ్ఇండియా బౌలర్లలో 3 మ్యాచ్‌ల్లో సిరాజ్ 13 వికెట్లు, 2 మ్యాచ్‌ల్లో హర్షిత్ రాణా 4 వికెట్లు, ఒక మ్యాచ్ ఆడిన ఆకాశ్ దీప్ 2 వికెట్లు పడగొట్టాడు. అంటే ఈ ముగ్గురి వికెట్లు కలిపినా 19 మాత్రమే అవుతాయి. దీన్ని బట్టే బుమ్రా టీమ్ఇండియాకు ఎంత కీలకంగా మారాడో అర్థం చేసుకోవచ్చు.
ఒక్కడి పోరాటం!
తొలి టెస్టులో బుమ్రా అత్యత్తమ ప్రదర్శన వల్లే భారత్ నెగ్గింది. ఆ మ్యాచ్‌లో బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి కాస్త సహకారం లభించింది. కానీ, రెండో టెస్టులో హెడ్‌ను భారత్ ఆపలేకపోయింది. ఓ ఎండ్‌లో బుమ్రా ఒత్తిడి పెంచినప్పటికీ, మిగతా బౌలర్లు రాణించలేకపోయారు. ఇక మన బ్యాటర్లూ విఫలమవడం వల్ల ఆ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు.
ఇక గబ్బా టెస్టులో బుమ్రాది ఒంటరి పోరాటమే. బ్యాటర్లూ తేలిపోయారు. మిగతా బౌలర్లూ చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఓ వైపు వికెట్లు పడగొడుతూన్నా, మరోవైపు నుంచి ఏ బౌలర్ కూడా కనీసం ప్రభావం చూపలేదు. ఆస్ట్రేలియా కోల్పోయిన తొలి 6 వికెట్లలో 5 బుమ్రానే పడగొట్టం విశేషం. ఆసీస్ బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడుకుంటూ, మిగత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో వర్షం కలిసొచ్చి మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది.
ఈసారైనా?
కాగా, మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో మ్యాచ్‌లో పేస్‌కు అనుకూలించే పిచ్‌ను బుమ్రా బౌలింగ్ దళం ఎలా ఉపయోగించుకుంటుందన్నది కీలకం. బుమ్రా ఉత్తమ ప్రదర్శన చేస్తాడనడంలో ఎవరికీ డౌట్ లేదు. అయితే మిగతా పేసర్లు మరో ఎండ్‌లో అతడిసి సహకరిస్తే, ఆసీస్ బ్యాటర్లకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా హెడ్‌ను కంట్రోల్ చేయాలి. అతడిని మాటలతో రెచ్చగొడుతున్న సిరాజ్, బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపట్లేదు. అయితే మెల్‌బోర్న్ పిచ్ అతడికి సహకరించవచ్చు. ఇక్కడ అతడు విజృంభిస్తే భారత్‌కు తిరుగుండదు.
There is no substitute for hard work.
— BCCI (@BCCI) December 21, 2024
The relentless effort behind the scenes translates into success on the field. The Indian bowlers are ticking every box as we get ready for the Boxing Day Test 🔥🔥#AUSvIND #TeamIndia pic.twitter.com/ikNQjJz77b
బాక్సింగ్ డే టెస్టు - బుమ్రా, స్మిత్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డులు