Allu Arjun Police Investigation : హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 18 మందిని నిందితులుగా చేర్చగా ఏ-11గా ఉన్న అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి ఠాణాలో విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు విచారించిన పోలీసులు, వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే సీన్ రీ కంస్ట్రక్షన్‌లో భాగంగా సంధ్య థియేటర్‌కు రావాల్సి ఉంటుందని పోలీసులు అల్లు అర్జున్‌కు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి విచారణ ముగిసి తిరిగి ఇంటికి చేరుకున్నంత వరకూ అల్లు అర్జున్‌కు భారీ బందోబస్తు కల్పించారు.
తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణకు హాజర్యయారు. న్యాయవాది మినహా మరెవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. తొక్కిసలాటకి ముందు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు 20కు పైగా ప్రశ్నలు సంధించారు. సుమారు మూడున్నర గంటల పాటు పలు అంశాలను ప్రస్తావించిన పోలీసులు అల్లు అర్జున్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పగా విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ తెలిపారు. రేవతి మరణించిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు వచ్చిన తమకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలియదని పోలీసులకు బన్నీ తెలిపారు.
తొక్కిసలాటకు అల్లు అర్జున్ బౌన్సర్లే ప్రధాన కారణం : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు అల్లు అర్జున్ బౌన్సర్లే ప్రధాన కారణమని దర్యాప్తులో గుర్తించారు. బన్నీ థియేటర్ లోపలికి అప్పర్ బాల్కనీలోకి వెళ్లే ముందు సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను బౌన్సర్లు నెట్టేసుకుంటూ వెళ్లటంతో చాలామంది కుర్చీల మధ్య పడిపోయారు. ఆ సమయంలో కిందపడి రేవతి చనిపోయిందని దర్యాప్తులో నిర్ధారించారు. ఆదివారం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఘర్షణ జరగడం, కుండీలు పగలగొట్టి విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు భారీగా మోహరించారు. అల్లు అర్జున్ నివాసం వైపు ఎవరిని రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు - దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త!
'22 ఏళ్లు కష్టపడి సాధించుకున్న నమ్మకం, గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారు' - బన్నీ కన్నీంటి పర్యంతం