Yadadri Jayanti Utsavalu : మే 2 నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
🎬 Watch Now: Feature Video
Yadadri Jayanti Utsavalu: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో వచ్చే నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. విశ్వక్సేన ఆరాధనతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు తిరు వేంకటపతి అలంకార సేవోత్సవాన్ని చేపడుతారు. మూడు రోజుల పాటు వివిధ క్రతువులను నిర్వహించనున్నారు. పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ జయంతి ఉత్సవాలు చేస్తారు.
Yadadri Temple News : మే 2న ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, లక్ష కుంకుమార్చన పూజలు చేయనున్నారు.. తిరువేంకటపతి అలంకార సేవోత్సవాన్ని చేపడుతారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురార్పణం, హోమం నిర్వహిస్తారు. రాత్రి గరుడ వాహనోత్సవాన్ని చేయనున్నారు. మే 3న ఉదయం నిత్యమూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయ మర్దన అలంకార సేవోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం నరసింహ మూలమంత్ర హవనం, హనుమద్వాహం, హనుమంత వాహనంపై శ్రీ రాముడి అలంకారోత్సవాన్ని చేయనున్నారు. మే 4న ఉదయం నృసింహ మూలమంత్ర హవనం, మహాపూర్ణాహుతి, గర్భాలయంలోని మూలవరులకు సహస్ర కలశాభిషేకం, రాత్రి నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన నిర్వహిస్తారు.
పాతగుట్టలోనూ అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి జయంతి ఉత్సవాలను మే నెల 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తారని ఆలయ ఈవో గీత తెలిపారు.