WWE Wrestler The Great Khali Participate in Adilabad Ganesh Immersion : గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ - ఆదిలాబాద్‌లో రెజ్లర్ ఖలీ సందడి
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2023, 11:01 PM IST
WWE Wrestler The Great Khali Participate in Adilabad Ganesh Immersion : ఆదిలాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ సందడి చేశారు. గురువారం మహాలక్ష్మి గణేశ్ మండల్ అధ్యక్షుడు ఆదిత్య ఖండేష్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని నిమజ్జోత్సవ శోభాయాత్రలో ఖలీ పాల్గొన్నారు. ఆయన రాకతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తమ అభిమాన రెజ్లర్‌ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎంతో ఉత్సాహంగా పోటీ పడ్డారు. కనుచూపమేర రోడ్లన్నీ జనంతో కిక్కరిసిపోయాయి. జనసందోహంతో శోభాయాత్ర ఇంకాస్త కోలాహలంగా మారింది. అశేష యువతను చూసి ముగ్ధుడైన ఖలీ.. తన మొబైల్లో అభిమానుల ఫొటోలను తీశాడు. అంబేడ్కర్ చౌక్ నుంచి చేపట్టిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ది గ్రేట్ ఖలీ మాట్లాడి.. అందరిలో జోష్ నింపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మత్తు పదార్థాలకు జోలికి వెళ్లకుండా ఉండాలని ఈ సందర్భంగా ఖలీ ప్రజలను కోరారు.