వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్ వెనుక ఓ 'రైతు'- ఎవరికీ తెలియని సీక్రెట్ ఇది! - ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్
🎬 Watch Now: Feature Video


Published : Nov 19, 2023, 3:12 PM IST
World Cup Final 2023 Stadium Pitch : ఐసీసీ వరల్డ్ కప్ భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ వేదికైన నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌ను ప్రత్యేకమైన ఎర్ర మట్టితో రూపొందించారు. గుజరాత్ నవ్సారీ జిల్లా పత్రీ గ్రామంలోని ఓ రైతు పొలం నుంచి ఈ మట్టిని తీసుకొచ్చారు.
గతంలో అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లకు వేదికలైన స్టేడియంలలోని పిచ్‌ల కోసం తమ పొలంలోని ఎర్ర మట్టినే ఉపయోగించారని చెబుతున్నారు రైతు అశోక్ దొరాజియా. టీమ్ ఇండియా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు.
"ఇక్కడి ఎర్రమట్టితోనే పిచ్ చేశారు. ఇది నాకు గర్వకారణం. బరోడాలో టీ20 జరిగినప్పుడు కామెంటేటర్ కూడా పిచ్ గురించి ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ఈ మట్టితో చేసిన పిచ్‌పై ఆడి మన దేశ జట్టు గెలుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది."
--అశోక్ దొరాజియా, రైతు
ఈ ఎర్ర మట్టి ఎంతో ప్రత్యేకమట. దీనితో పిచ్‌లు తయారు చేస్తే త్వరగా పగుళ్లు రాకుండా.. ఎక్కువకాలం మన్నుతాయట.
"ఇంతకుముందు ఇక్కడ పెంకుల ఫ్యాక్టరీ ఉండేది. తర్వాత వ్యవసాయ భూమిగా మార్చుదామని చూశాం. కానీ ఎర్ర మట్టి వచ్చింది. క్రికెట్ వాళ్లు ఆ మట్టిని తీసుకెళ్లి, పిచ్ తయారీకి వాడారు. అప్పుడు దీని ప్రత్యేకత ఏంటో తెలిసింది. ఎర్ర మట్టి ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఇది ప్రత్యేకం. అందుకే మనం వరల్డ్ కప్ గెలుస్తున్నామని నేను ధీమాగా చెప్పగలను."
--అశోక్ దొరాజియా, రైతు
ఫైనల్ మ్యాచ్ పిచ్ తయారీకి ఉపయోగించిన ఎర్ర మట్టి.. మరెక్కడా దొరకదని చెబుతున్నారు అశోక్ దొరాజియా.
విజేతకు రూ.32 కోట్లు- రన్నరప్‌కు రూ.16 కోట్లు- వరల్డ్ కప్ ప్రైజ్ మనీ వివరాలు ఇవే!
12 ఫైనల్స్ 6 శతకాలు - వరల్డ్‌కప్ హిస్టరీలో లాస్ట్ మ్యాచ్ సెంచరీల హీరోలు