Woman Leg Stuck in Bore Well : బోరులో కూరుకుపోయిన మహిళ కాలు.. చివరికి ఏమైందంటే? - woman stuck bore well yadadri bhuvanagiri district
🎬 Watch Now: Feature Video
Woman Leg Stuck in Bore Well Bhuvanagiri : ప్రమాదం.. ఏ వైపు నుంచి ఎలా ముంచుకు వస్తుందో ఎవరూ ఊహించలేరని పెద్దలు ఎప్పుడూ అంటుంటారు. తాజాగా యాదాద్రి భుననగిరి జిల్లాలో ఓ మహిళ కూడా అలాంటి ప్రమాదం బారినే పడింది. కానీ ఎట్టకేలకు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. బొమ్మలరామారం మండలం సోలిపేటలో ఓ రైతు పొలంలో.. కూలీలు నాటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పద్మ అనే మహిళ కాలు.. ప్రమాదవశాత్తు పాతబోరులో ఇరుక్కుపోయింది. తోటి కూలీలు కలిసి ఆమెని బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
వెంటనే వారు పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు మూడు గంటల పాటు శ్రమించినా పద్మను బయటకు తీయలేకపోయారు. చివరకు ప్రొక్లెయిన్ సాయంతో బోరు గొయ్యి చుట్టూ గుంత తీశారు. అనంతరం.. కేసింగ్ పైపు కోసి.. ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం పద్మను.. భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.