Woman Burnt Alive: తల్లికూతుళ్ల గొడవ.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కుమార్తె - prathipadu woman suicide
🎬 Watch Now: Feature Video
Woman Burnt Alive: తల్లీకూతుళ్ల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాలు చివరికి కుమార్తె ప్రాణాలు తీశాయి. తల్లీకూతుళ్లు ఇరువురు ఒకరినొకరు బెదిరించుకునే సమయంలో కుమార్తె ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఎవరూ ఉహించని రీతిలో అందరూ చూస్తుండగానే కుమార్తె క్షణాల్లో సజీవదహనమైంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళకు.. ఆమె చిన్న కుమార్తె సుజాతకు గతంలో ఆస్తి తగాదాలు తలెత్తాయి.
దీనిపై వారిద్దరు గొడవపడుతుండే వారు. ఈ గొడవలు జరుగుతున్న క్రమంలో తనను కుమార్తె ఇంటి నుంచి గెంటివేసి.. దాడి చేసి గాయపరిచిందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మరోసారి తల్లీకూతుళ్లల మధ్య మరోసారి ఇదే అంశంలో వివాదం చెలరేగింది. వారిద్దరూ పెట్రోల్ సీసాలు పట్టుకుని ఒకరినొకరు బెదిరించుకున్నారు. ఇద్దరు గొడవ పడుతుండగా ఎవరూ ఊహించని రీతిలో సుజాత తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో ఆమె సజీవదహనమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.