మంచు కురిసే వేళ కొండ కోనల్లో సందడి చేస్తున్న వన్యప్రాణులు - himalayan ibex in himachal pradesh
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని నెలాంగ్ వ్యాలీలో సంచరిస్తున్న ఓ మంచు చిరుతపులిని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరిశోధనా బృందం కెమెరాలో బంధించింది. 2016 నుంచి ఏటా ఇక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్ టీమ్ డిసెంబర్‌లో నెలాంగ్, జాదుంగ్ ప్రాంతాల్లో సుమారు 65 ట్రాప్ కెమెరాలను పెట్టింది. ఈ క్రమంలో ఓ పరిశోధకుడి కెమెరాకు ఈ మంచు చిరుత చిక్కింది. మరోవైపు, మంచు కురిసిన వేళ హిమగిరుల్లో అక్కడి అడవి మేకలు సందడి చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని కొండలలో గురువారం హిమాలయన్ ఐబెక్స్ అనే ఈ అడవి మేకలు కొండ గట్టులపై సంచరిస్తూ కనువిందు చేశాయి.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST