Wild Elephant Attack : పర్యటకులను బెంబేలెత్తించిన ఏనుగు.. అడవి మధ్యలో దారి కాచి.. - Wild elephant try to attacks safari vehicles
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 12:18 PM IST
Wild Elephant Attack Safari Vehicles : అడవి మధ్యలో పర్యటకుల వాహనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది ఓ ఏనుగు. కొద్ది దూరం వరకు పర్యటకుల వాహనాలను వెంబడించింది. ముందు ఓ సఫారీ వాహనాన్ని తరిమింది ఆ ఏనుగు. దీంతో వాహనాన్ని రివర్స్‌లో పోనిచ్చాడు డ్రైవర్. అనంతరం ఇంకో వైపుగా వస్తున్న మరో పర్యటకుల వాహనాన్ని కూడా వెంబడించింది. దీంతో ఆ వాహనాన్ని కూడా వెనక్కి పోనిచ్చాడు డ్రైవర్. వాహనాలను ఏనుగు తరుముతున్న దృశ్యాలను వీడియో తీశారు ఓ పర్యటకుడు. అనంతరం తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది ఏనుగు. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఉన్న నాగర్ హోల్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది.
బైకర్లపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వాహనంతో పాటే అడవిలోకి పరార్!
Wild Elephant Attack in Kerala Wayanad : కొద్ది రోజుల క్రితం కూడా కేరళలోని వయనాడ్‌లో ఓ ఏనుగు హల్చల్ చేసింది. వయనాడ్ అభయారణ్యంలో బైకర్లపైకి దూసుకెళ్లింది. ఏనుగును చూసి బైకర్లు రోడ్డుపైనే ఆగిపోగా.. అదేసమయంలో గజరాజు వారిపైకి దూసుకొచ్చింది. ఏనుగును చూసి ఓ యువకుడు వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ద్విచక్రవాహనంపై ఉన్న మరో వ్యక్తి తన బైక్‌ను అడవిలోకి పోనిచ్చాడు. దీంతో త్రుటిలో ఏనుగు నుంచి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. వయనాడ్ అభయారణ్యంలోని ముథంగ-బందీపుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.