బైకర్లపైకి దూసుకొచ్చిన ఏనుగు.. వాహనంతో పాటే అడవిలోకి పరార్! - కేరళ ఏనుగు వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2023, 9:57 AM IST

Wild Elephant Attack in Kerala Wayanad : కేరళలోని వయనాడ్​లో ఓ ఏనుగు హల్​చల్ చేసింది. వయనాడ్ అభయారణ్యంలో బైకర్లపైకి దూసుకెళ్లింది. ఏనుగును చూసి బైకర్లు రోడ్డుపైనే ఆగిపోగా.. అదేసమయంలో గజరాజు వారిపైకి దూసుకొచ్చింది. ఏనుగును చూసి ఓ యువకుడు వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ద్విచక్రవాహనంపై ఉన్న మరో వ్యక్తి తన బైక్​ను అడవిలోకి పోనిచ్చాడు. దీంతో త్రుటిలో ఏనుగు నుంచి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. వయనాడ్ అభయారణ్యంలోని ముథంగ-బందీపుర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 8 గంటలకు జరిగిందీ ఘటన.

Elephant Attacks Bikers Kerala : బైకర్ల వెనక కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు. ఏనుగును చూసి బైకర్లు రోడ్డు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఏనుగు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చే సరికి వారు ఆందోళన చెందారు. దీంతో బైక్ రోడ్డుపైనే పడిపోయింది. బైక్​ను పైకి లేపుతుండగా.. ఏనుగు వారికి మరింత దగ్గరగా వచ్చింది. ఈ సమయంలోనే ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. బైక్​ను పట్టుకున్న మరో వ్యక్తి.. వాహనాన్ని ప్రారంభించి రోడ్డు పక్కన అడవిలోకి పోనిచ్చాడు. ఆ తర్వాత బైక్​ను వదిలేసి పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. మలప్పురంలోని కొట్టక్కల్​ ప్రాంతానికి చెందిన నజీర్ ఈ వీడియో రికార్డ్ చేశాడు. ఏనుగు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు వ్యక్తులు కర్ణాటకకు చెందినవారిగా గుర్తించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.