వర్షపు నీటికి సరస్సులా మారిన ఆస్పత్రి.. నడవలేక రోగుల ఇబ్బందులు - బిహార్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
బిహార్ రాజధాని పట్నాలోని నలందా మెడికల్ కాలేజీ ఆస్పత్రి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఫలితంగా రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతుకి నీళ్లు రావడం వల్ల అవస్థలు పడ్డారు. చిన్న పిల్లలతో ఆస్పత్రికి వచ్చిన రోగులు.. నీటిలో నడవలేక ఇబ్బంది పడ్డారు. ఇటీవల ఆస్పత్రిలో అకస్మిక పర్యటన చేసిన ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్.. పరిస్థితిపై ఆరా తీశారు. దీనికి స్పందించిన ఆస్పత్రి అధికారులు.. నీరు నిలువకుండా ఉడేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు. నీరు నిలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరారు. ప్రతి ఏడాది వర్షకాలంలో ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని రోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆస్పత్రిగా పేరొందిన నలందా మెడికల్ కాలేజీ ఆస్పత్రి.. చిన్న వర్షానికి సరస్సులా మారిపోయింది. ఆస్పత్రి మొత్తం మునిగిపోయి.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆస్పత్రి యాజమాన్యం సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు.