యువకుడిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు.. ఎందుకంటే? - రాజస్థాన్ ఉదయ్‌పూర్ చెట్టుకు కట్టి దాడి
🎬 Watch Now: Feature Video
యువతితో సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని తీవ్రంగా హింసించారు కొందరు దుండగులు. అతడిని తాళ్లతో చెట్టుకు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో ఈ ఘటన జరిగింది. స్థానిక యువతితో యువకుడు సంబంధం పెట్టుకున్నాడని, ఆమెను కిడ్నాప్ చేశాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అందుకే అతడిపై దాడి జరిగిందని చెబుతున్నారు. యువకుడిని కొడుతున్న వీడియో బయటకు రాగా.. పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధితుడితో పాటు అతడితో సంబంధం ఉందని బావిస్తున్న యువతి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.