Wall Collapse Video Viral : కూర్చున్న కొమ్మ నరికినట్టు.. గోడ కింద నిలబడి కూలగొట్టారు.. చివరకు - గోడ కూలీ వ్యక్తి మృతి
🎬 Watch Now: Feature Video


Published : Aug 23, 2023, 2:22 PM IST
Wall Collapse Video Viral : చావు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికి తెలీదు. కాబట్టి ప్రజలు చేసే పని పట్ల శ్రద్ధతో పని చేయాలని అధికారులు ఈ ఘటనను ఉదాహరణగా తీసుకొని చెబున్నారు. పాత గోడను కూల్చే సమయంలో ప్రాణాలనే పోగొట్టుకున్నాడో వ్యక్తి. ఈ దుర్ఘటన హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాపిరెడ్డి కాలనిలో రాజీవ్ గృహ కల్ప సమీపంలో కూకట్పల్లి చెందిన జయరావు(45) రోజుకూలీ పనిలో భాగంగా నిన్న పాత ఇంటిని గోడను కూల్చే పనికి వెళ్లారు. తనతో పాటు మరో వ్యక్తి ఇద్దరు కలిసి పాత గోడను కూల్చడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గోడ మీద పడింది. దీంతో జయరావుకి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయరావు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలిపారు.