Visakha Steel Plant Land Sale Commencement: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి మొదలైన ప్రక్రియ.. భూముల అమ్మకానికి త్రైపాక్షిక ఒప్పందం - Visakha Steel Plant news
🎬 Watch Now: Feature Video
Published : Sep 29, 2023, 7:43 PM IST
|Updated : Sep 29, 2023, 8:08 PM IST
Visakha Steel Plant Land Sale Commencement: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని, స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూములు, ఆస్తులను విక్రయానికి పెట్టవద్దని.. గతకొన్ని నెలలుగా కార్మికులు, ప్రతిపక్షాలు, వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూముల విక్రయానికి.. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది. స్టీల్ ప్లాంట్‌లోని.. నాన్ కోర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి.. నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పొరేషన్, నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్‌నిగమ్ లిమిటెడ్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
Agreement on Sale of Vizag Steel Plant Lands: ఒప్పందంలో భాగంగా.. నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పొరేషన్ తొలిదశలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చెందిన 1400 ఎకరాల భూములను విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్.. సాంకేతిక, భూముల బదలాయింపు సలహాదారుగా వ్యవహరించనుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అమిత్ గుప్తా, NBCC ప్రతినిధులు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
Gautam Adani Met With Cm Jagan: ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ నియంత్రణలో 19 వేల 703 ఎకరాల భూమి ఉందని.. వీటిపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌తో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ పవర్ ఆఫ్ అటార్ని కలిగి ఉన్నట్టుగా, కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి సంబంధించి నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పొరేషన్, NBCCతో ఒప్పందం కుదరడానికి ముందురోజే.. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ.. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది.