VIRAL VIDEO : పక్కకు ఒరిగిన భవనం.. భయాందోళనలో స్థానికులు - Collapsing building in Bahadurpura
🎬 Watch Now: Feature Video
Under Construction Building Tilted in Bahadurpura : హైదరాబాద్ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ 4 అంతస్థుల భవనం పక్కకు ఒరిగింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఏరియా కార్పొరేటర్, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవన యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఒరిగిన భవనాన్ని కూల్చి వేయడానికి బెంగళూరుకు చెందిన కంపెనీతో.. భవన యజమాని ఒప్పందం చేసుకున్నారు. వారు రేపటిలోగా వస్తారని అధికారులు తెలిపారు. అప్పుడు చుట్టుపక్కల నిర్మాణాలకు ఎలాంటి హాని కలగకుండా కూల్చివేత ప్రకియ జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంవైపు ఎవ్వరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని బహదూర్‌పురా సీఐ అనిల్ స్పష్టం చేశారు.