ఒకే చోట వందల వింటేజ్ కార్లు - చూస్తే ఔరా అనాల్సిందే - Hyderabad Public School Vintage Car Show
🎬 Watch Now: Feature Video
Published : Dec 26, 2023, 12:40 PM IST
Vintage Cars Expo in Hyderabad : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రోజు ఏర్పాటు చేసిన వింటేజ్ కార్ల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. 1990లలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. భారతీయ ఫియెట్ కారు మొదలుకొని విదేశాల నుంచి వచ్చిన అప్పటి స్పోర్ట్స్ కార్ల వరకు కొలువుదీరిన ఈ ప్రదర్శన ఔరా అనిపిస్తోంది. పాత కాలంలో ఉండే కార్లు ఎలా ఉన్నాయి. అవి ఎలా పని చేస్తాయని పిల్లలకి క్లబ్ మెంబర్ వెంకటరామారావు తెలియజేస్తున్నారు.
Hyderabad Public School Centenary Celebrations : నిజాం కాలంలో ఉస్మాన్ అలీ ఖాన్ వాడిన కారు వాటి ప్రత్యేకత గురించి పిల్లలకు తెలియజేస్తున్నారు. ఈ కారుకు ముందుకు, వెనకకు గేర్స్ ఉంటాయని అప్పటి కాలంలో జంతువులు దాడి చేస్తే వెనుకకు కూడా పరుగులు తీయాలని ప్రత్యేకంగా ఈ గేర్ బాక్స్‌ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. "శతాబ్ది ఉత్సవాలలో పిల్లలకు ఈ కార్లను చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పట్లోనే కార్లు చాలా బాగా తయారుచేశారు. అలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఉపయోగిస్తే బాగుంటుంది.'' అని పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.