Villagers Crossed River With Dead Body Viral Video : ఉద్ధృతంగా ప్రవాహం.. మృతదేహంతో నదిని దాటిన గ్రామస్థులు.. చాలా డేంజర్‌గా! - మృతదేహంతో నదిని దాటిన గ్రామస్థులు వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2023, 10:22 AM IST
Villagers Crossed River With Dead Body Viral Video : మృతదేహాన్ని తీసుకుని ఆనకట్ట మీదుగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటారు కొందరు గ్రామస్థులు. ఆస్పత్రిలో శవపరీక్షలు జరిపించేందుకే అలా తీసుకెళ్లారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగింది.
అసలేమైందంటే?
Villagers Carrying Dead Body On River : జిల్లాలో గతకొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సంబల్పుర్ ప్రాంతానికి చెందిన మాండ్వి అనే వ్యక్తి.. శుక్రవారం అనుమానాస్పద రీతిలో మరణించాడు. దీంతో అతడి మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించాలని గ్రామస్థులు నిర్ణయించారు. అందుకు సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి మృతదేహానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఆస్పత్రికి, గ్రామానికి మధ్య ఆనకట్ట ఉంది. భారీ వర్షాలకు మేధ్కీ నది ప్రవహిస్తోంది. ఆ ఆనకట్టపై వంతెన లేకపోవడం వల్ల మాండ్వి మృతదేహాన్ని తీసుకుని నదిని దాటారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ అధికారులు.. మీడియాతో మాట్లాడారు.
తమ దృష్టికి జరిగిన విషయమంతా వచ్చిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అవినాశ్ ఖరే తెలిపారు. ఆనకట్ట మీదుగా నీరు ప్రవహిస్తున్నప్పుడు నదిని దాటవద్దని ప్రజలను కోరారు. మృతదేహాన్ని శవపరీక్షల కోసం తీసుకెళ్లాలనుకుంటే తమను సంప్రదించాలని.. ఉచితంగా వాహనం పంపుతామని చెప్పారు. అయితే తమ గ్రామానికి వంతెన లేకపోతే.. అంబులెన్స్ ఎలా వస్తుందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.