కాపాడాల్సినవారే అంబులెన్స్‌తో తొక్కించారు.. పక్కకు లాగేసి వెళ్లిపోయారు - అంబేద్కర్‌నగర్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Ambulance Accident In UP: ఉత్తర్‌ప్రదేశ్ అంబేద్కర్‌నగర్‌లో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాపాడాల్సిన వైద్య సిబ్బందే అంబులెన్స్‌తో ఢీ కొట్టి.. నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లారు. ఏప్రిల్ 13న అక్బర్పుర్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులను అంబులెన్స్ ఢీ కొట్టింది. యువకుల్లో ఒకరిని 108 వాహనం కొంత దూరం లాకెళ్లింది. అనంతరం సిబ్బంది దిగి వెనక చక్రం కింద ఉన్న బాధితుడిని బయటకి లాగి.. రోడ్డుపైనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు సైతం సహాయం చేయలేదు. చివరకు స్థానికలు వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST