Vegetable Vehicle fallen and theft video Viral : ఈ కష్టం పగోనికి కూడా రావద్దు నాయనా...! - వాగులో పడిన వాహనంలోంచి కూరగాయలు ఎత్తుకెళ్లిన జనం
🎬 Watch Now: Feature Video
Vegetable Vehicle fallen Video Viral : ప్రస్తుతం బాగా నడుస్తున్న బిజినెస్ అంటే ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చే మాట కూరగాయల వ్యాపారం. గత కొంత కాలంగా పెరుగుతున్న కూరగాయర ధరలు కొందరి రైతులని కోట్లాధిపతులని చేశాయి. జీవితాలనే మార్చాయి. కానీ ఈ వ్యాపారస్థుడికి మాత్రం తీరని నష్టాన్ని బాధని మిగిల్చింది. ఇంతకి ఏమైందంటే....! కూరగాయలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఆ వాహనాన్ని బయటకు తీయగానే స్థానికులు గుంపులుగా వచ్చి అందులో ఉన్న కూరగాయలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాం గ్రామంలో కూరగాయలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో పడింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారన్నారు. కూరగాయల వాహనాన్ని క్రేన్ సహాయంలో బయటకు తీసినట్లు వారు తెలిపారు. కాగా ఆ వాహనాన్ని బయటకు తీశారో లేదో అక్కడున్న జనం గుంపులుగుంపులుగా వచ్చి అందులో ఉన్న కూరగాయల్ని సంచుల్లో వేసుకొని వెళ్లారు.