Varalakshmi Vratham At Bhadrakali Temple : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. భద్రకాళీ ఆలయంలో భక్తుల కోలాహలం - Varalakshmi Vratham At Bhadrakali Temple
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2023, 11:54 AM IST
|Updated : Aug 25, 2023, 3:10 PM IST
Varalakshmi Vratham At Bhadrakali Temple : వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓరుగల్లులో అత్యంత ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.
Sravana Sukravaram At Bhadrakali Temple : సర్వాంగ సుందరంగా కొలువుదీరిన అమ్మవారి సన్నిధికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు. కన్యకా పరమేశ్వరి గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణలతో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.
రద్దీ ఎక్కువగా ఉండటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులు సుమారు గంట పాటు వేచి చూడగా.. వీఐపీలు, వారి సహచరులను అర్చకులు మరో మార్గం గుండా లోపలికి అనుమతించారు. దీంతో సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకొని.. క్యూలైన్లలో బారులు తీరడంపై అసహనం వ్యక్తం చేశారు.