Vande Bharat Expresses Trains in Telugu States తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం.. ఎక్కడినుంచి అంటే..!

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 4:01 PM IST

Vande Bharat Expresses Trains Started in Telugu States: భారతీయ రైల్వేలో (Indian Railways) నూతన సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వందేభారత్‌ (Vande Bharat) రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 25 రైళ్లు దేశ వ్యాప్తంగా సేవలందిస్తుండగా కొత్తగా మరో తొమ్మిది రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వీటిని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందేభారత్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. విజయవాడ-చెన్నై సెంట్రల్‌ (VIJAYAWADA-CHENNAI), కాచిగూడ-బెంగళూరు (KACHEGUDA- YESVANTPUR JN) వందేభారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 9 వందేభారత్ సర్వీసులను ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. విజయవాడ-చెన్నై సెంట్రల్‌ మార్గంలో వందేభారత్‌ రైలు తెనాలి, నెల్లూరు, రేణిగుంట మీదుగా నడవనుంది. అలాగే మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం మీదుగా కాచిగూడ-బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించనుంది. విజయవాడ రైల్వేస్టేషన్‌లో డీఆఎం (DRM) సహా ఇతర అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో 25 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటివరకు కోటీ 11 లక్షల మంది ఈ రైళ్లలో ప్రయాణించారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.