భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - శ్రీకృష్ణావతారంలో శ్రీరామచంద్రుడు - భద్రాచలం ఉత్తర ద్వార దర్శనం
🎬 Watch Now: Feature Video
Published : Dec 21, 2023, 3:44 PM IST
Vaikunta Ekadasi Festival in Bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో, దశావతారాల్లో చివరి రోజు అయిన నేడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈనెల 13 నుంచి రోజుకు ఒక అవతారంలో దర్శనం ఇచ్చిన స్వామివారు ఇవాళ తొమ్మిదో రోజు శ్రీకృష్ణ అవతారంలో పూజలు అందుకుంటున్నారు. ప్రధాన ఆలయం నుంచి బేడ మండపం వద్దకు తీసుకొచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం స్వామివారు సకల రాజ లాంఛనాల నడుమ తిరువీధి సేవకు బయలుదేరారు.
Bhadradri Ramayya Teppotsavam : పట్టణ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం మిథిలా స్టేడియంలో వేచి ఉన్న భక్తులకు దర్శనమిస్తారు. రేపు స్వామివారికి పవిత్ర గోదావరి నదిలో హంస వాహనంపై తెప్పోత్సవం వేడుక జరగనుంది. ఈనెల 23న ఉదయం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 22, 23న జరగనున్న ప్రధాన ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.