సేమ్​ ప్లేస్​.. సేమ్​ సీన్​.. పంత్​కు యాక్సిడెంట్​ అయిన చోట మళ్లీ అలానే! - Rishabh Pant car accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 16, 2023, 2:02 PM IST

ఉత్తరాఖండ్ రూర్కీలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు పక్కనే వెళ్తున్న ట్రాక్టర్​ను ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఆ సమయంలో హరియాణా నుంచి ఓ బస్సు కారు వెనుకే వస్తుంది. అయితే ఆ బస్సు.. కారును ఢీకొట్టలేదు. దీంతో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. బుధవారం సాయంత్రం జరిగిందీ ఘటన. క్షతగాత్రులందరూ ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాకు చెందిన వారని తెలుస్తోంది.

అంతకుముందు గతేడాది డిసెంబరు 30న టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన చోటే ఈ యాక్సిడెంట్​ కూడా జరగడం గమనార్హం. ఈ రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం రిషభ్ పంత్ క్రమంలో కోలుకుంటున్నాడు. ఆయన దెహ్రాదూన్​లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.